Advertisement

  • స్పుత్నిక్ టీకా ట్ర‌య‌ల్స్ భార‌త్‌లో: కిరిల్ దిమిత్రేవ్

స్పుత్నిక్ టీకా ట్ర‌య‌ల్స్ భార‌త్‌లో: కిరిల్ దిమిత్రేవ్

By: chandrasekar Tue, 08 Sept 2020 9:05 PM

స్పుత్నిక్ టీకా ట్ర‌య‌ల్స్  భార‌త్‌లో:  కిరిల్ దిమిత్రేవ్


భార‌త్‌లో ఈనెల‌లోనే ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాకు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ర‌ష్య‌న్ డైర‌క్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిప‌తి కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు. భార‌త్‌తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, పిలిప్పీన్స్‌, బ్రెజిల్ దేశాల్లోనూ ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌నున్నారు. మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించిన ప్రిలిమిన‌రీ ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో ప్ర‌చురించ‌నున్న‌ట్లు దిమిత్రేవ్ తెలిపారు.

ద లాన్‌సెట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన ప్రాథ‌మిక అంశాల ప్ర‌కారం 76 మందికి తొలుత టీకా ఇచ్చి 42 రోజుల పాటు ప‌రీక్షించారు. అయితే వారిలో కేవ‌లం 21 రోజుల్లో యాంటీబాడీలు పెరిగిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు విపులంగా విశ్లేషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌మ‌గ్ర‌మైన డేటాను వారు ప‌రిశీలిస్తున్నారు. మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న కోణంలో అన్వేష‌ణ సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త నెల‌లో స్పుత్నిక్ వీ టీకాకు ర‌ష్యా ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ సుర‌క్షిత‌మ‌మైన‌ద‌ని, ప్ర‌భావంత‌మైన‌ద‌ని తేలేంత వ‌ర‌కు ఎటువంటి టీకాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

Tags :
|
|

Advertisement