Advertisement

భారత్‌ వచ్చిన‌ స్పుత్నిక్‌ వి టీకాలు....

By: chandrasekar Thu, 12 Nov 2020 11:18 AM

భారత్‌ వచ్చిన‌ స్పుత్నిక్‌ వి టీకాలు....


రష్యాలో అభివృద్ధి చేసిన కోవిడ్‌ స్పుత్నిక్‌ వి టీకాలు భారత్‌కు వచ్చాయని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కిన సంగతి విధితమే. త్వరలోనే పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ అధికారి ఒకరు అన్నారు.

డాక్టర్‌ రెడ్డీస్‌, స్పుత్నిక్‌ వి అన్న లోగోలున్న వాహనం నుంచి చిన్న పాటి కంటైనర్లను కిందకు దించుతూ ఒక వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’వ్యాక్సిన్‌ కోవిడ్‌ నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

దాదాపు 40,000 మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.డాక్టర్‌ రెడ్డీస్‌, ఆర్‌డీఐఎఫ్‌, రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి సెప్టెంబరు 2020న ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌కు ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది.

Tags :

Advertisement