Advertisement

  • ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర క్రీడల మంత్రి

ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర క్రీడల మంత్రి

By: Sankar Mon, 25 May 2020 10:01 AM

ఐపీయల్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర క్రీడల మంత్రి

దేశంలో విడతల వారీగా అన్ని రంగాలకు అనుమతులు ఇస్తుండటంతో , క్రికెట్ అభిమానులు ఐపీయల్ గురించి ఎదురు చూస్తున్నారు ..లాక్ డౌన్ లేకపోతే ఈ పాటికే ఈ సీజన్ ఐపీయల్ అయిపోయేది ...కానీ ఒక్కసారిగా కరోనా విజృంభణతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో క్రికెట్ తో పాటు అన్ని రకాల క్రీడలు వాయిదా పడ్డాయి ...అయితే ఐపీయల్ నిర్వహణపై తాజాగా కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేసాడు ...

ipl,rohit,kohli,kiran rijiju,dhoni,vivo,ipl2020 ,కిరణ్ రిజిజు,రోహిత్ , కోహ్లీ , వివో , ఐపీయల్ 2020

ఐపీఎల్‌ నిర్వహణ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్‌ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ కరోనా వైరస్‌ వ్యాప్తి పరిస్థితుల ఆధారంగా భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. క్రీడా టోర్నమెంట్‌లు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా కట్టడిపైనే ఉంది’ అని కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే... అవే తేదీల్లో భారత్‌లో ఐపీఎల్‌ టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

Tags :
|
|
|
|
|

Advertisement