Advertisement

  • క్రికెట్ లో జాతి వివక్షకు చోటు లేదు ..ప్రపంచాన్నే మార్చే శక్తి ఆటలకు ఉంది ..సచిన్

క్రికెట్ లో జాతి వివక్షకు చోటు లేదు ..ప్రపంచాన్నే మార్చే శక్తి ఆటలకు ఉంది ..సచిన్

By: Sankar Sat, 06 June 2020 3:47 PM

క్రికెట్ లో జాతి వివక్షకు చోటు లేదు ..ప్రపంచాన్నే మార్చే శక్తి ఆటలకు ఉంది ..సచిన్


అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అతని మెడపై పోలీసు ఆఫీసర్ మోకాలిని ఉంచి ఊపిరి ఆడకుండా చేసిన వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై క్రీడాకారులు కూడా సంతాపం తెలుపుతూ.. జాతి వివక్ష హేయమని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

sachin,icc,cricket,sports,world,racism ,అమెరికా,  నల్లజాతీయుడు, జార్జ్ ఫ్లాయిడ్ , సచిన్ ,  జాతి వివక్ష

క్రికెట్‌లో జాతి వివక్షకి స్థానం లేదని తాజాగా మరోసారి స్పష్టం చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. బార్బడోస్‌లో పుట్టి పెరిగిన ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్.. ఇంగ్లాండ్ తరఫున వన్డే ప్రపంచకప్‌లో ఆడటాన్ని గుర్తు చేస్తూ వీడియోని షేర్ చేసింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్‌కి గత ఏడాది వరకూ అందని ద్రాక్షగా కనిపించిన వరల్డ్‌కప్‌ని.. ఆ దేశానికి గత ఏడాది జోప్రా ఆర్చర్ తన అద్భుత బౌలింగ్‌తో అందించాడు. ముఖ్యంగా.. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌.. సూపర్ ఓవర్‌కి దారితీయగా.. ఆర్చర్ తెలివిగా బౌలింగ్ చేశాడు.

జాతి వివక్షపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఐసీసీ షేర్ చేసిన వీడియోని అభిమానులతో పంచుకున్న సచిన్ టెండూల్కర్.. నెల్సన్ మండేలా వ్యాఖ్యలని దానికి జత చేశాడు. ప్రపంచాన్ని మార్చే శక్తి స్పోర్ట్స్ ఉంది.. అలానే ప్రపంచాన్ని ఏకీకృతం చేసే పవర్‌ కూడా దానికి ఉందని అప్పట్లో మండేలా పిలుపునిచ్చాడు. అవే మాటల్ని సచిన్ తాజాగా అందరికీ గుర్తు చేశాడు.


Tags :
|
|
|
|

Advertisement