Advertisement

ధన్యశ్రీ వర్మను పెళ్ళాడిన స్పిన్నర్ చాహల్

By: chandrasekar Wed, 23 Dec 2020 10:02 AM

ధన్యశ్రీ వర్మను పెళ్ళాడిన స్పిన్నర్ చాహల్


ధన్యశ్రీ వర్మను పెళ్ళాడాడు భారతీయ యువ లెగ్ స్పిన్నర్ చాహల్. ఆమె ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుంది. అలాగే ఆమె కొరియోగ్రాఫర్ గా కూడా పేరుగాంచింది. ఆమె తల్లి డెంటల్ డాక్టర్ గాను మరియు తండ్రి బిజినెస్ చేస్తున్నట్లు తెలిసింది. తన తల్లి లగే డాక్టర్ కావాలని అనుకున్న ఆమె తరువాత కొరియోగ్రాఫర్ పేరుగాంచింది. ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపును పొందింది. చాహల్ కు దన్యశ్రీ కి ఆగస్టు నెలలో నిశ్చయదార్థం జరిగింది.

యూజవేంద్ర చాహల్ ఐపీఎల్ T20 కోసం బిజీ గా ఉండడంతో పెళ్లి ఆలస్యమైంది. ఐపీఎల్ తరువాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్ డే మ్యాచ్ మరియు T20 లలో చాహల్ ఆడిన తరువాత ఇప్పుడు ధన్యశ్రీ వర్మను పెళ్లాడాడు. ఇతని మణికట్టు స్పిన్ తో ప్రత్యర్థి బ్యాట్సమన్లను కంగుతినిపించగలడు. అటు టి20 లోను ఇటు వన్ డే లోను మంచి ప్రతిభతో వికెట్లు తీసి గుర్తింపు పొందాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు టీం తరపున ఆడుతున్నాడు.

Tags :
|

Advertisement