Advertisement

  • ఫ్రీబాల్ కాన్సెప్ట్ ను అమలు చేయాలని చెప్పిన స్పిన్నర్ అశ్విన్

ఫ్రీబాల్ కాన్సెప్ట్ ను అమలు చేయాలని చెప్పిన స్పిన్నర్ అశ్విన్

By: chandrasekar Tue, 25 Aug 2020 5:52 PM

ఫ్రీబాల్ కాన్సెప్ట్ ను అమలు చేయాలని చెప్పిన స్పిన్నర్ అశ్విన్


టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కి ఫ్రీ హిట్‌ ఉన్నట్టు బౌలర్లకు కూడా ఫ్రీ బాల్‌ ఉండాల్సిందేనని మరోసారి చెప్పాడు. బౌలర్‌ బాల్ వేయకముందే నాన్‌ స్ట్రయికర్‌ క్రీజును దాటితే తర్వాతి బాల్ ని ఫ్రీబాల్‌గా ప్రకటించే నిబంధన తీసుకురావాలని సూచించాడు. ఒకవేళ ఆ బంతికి బ్యాట్స్‌మన్‌ ఔటైతే బ్యాటింగ్‌ జట్టు ఖాతా నుంచి ఐదు పరుగులు తగ్గించాలని సోమవారం అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.

గతేడాది ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ పద్ధతి ద్వారా అశ్విన్‌ ఔట్‌ చేయడంతో విమర్శలు వచ్చాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌ను ఆ విధానం పాటించవద్దని చెబుతానని ఆ జట్టు హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఈ నేపథ్యంలో మన్కడింగ్‌ను పరోక్షంగా సమర్థించుకుంటూ అశ్విన్‌ కొత్త ప్రతిపాదన చేశాడు. మరోవైపు తాను పాంటింగ్‌తో ఫోన్‌లో మాట్లాడానని, అతడు యూఏఈకి వచ్చాక మరోసారి చర్చిస్తానని చెప్పాడు.

Tags :
|

Advertisement