Advertisement

  • ఐపీయల్ ఒక్కటే కాదు , జాతీయ జట్టులో చోటు సంపాదించడమే నా లక్ష్యం ..అమిత్ మిశ్రా

ఐపీయల్ ఒక్కటే కాదు , జాతీయ జట్టులో చోటు సంపాదించడమే నా లక్ష్యం ..అమిత్ మిశ్రా

By: Sankar Fri, 07 Aug 2020 6:53 PM

ఐపీయల్ ఒక్కటే కాదు , జాతీయ జట్టులో చోటు సంపాదించడమే నా లక్ష్యం ..అమిత్ మిశ్రా



భారత జట్టులో తిరిగి స్థానాన్ని సంపాదించుకుంటానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. మరి కొన్ని వారాల్లోనే ఐపీఎల్-2020 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టులో తన స్థానంపై మాట్లాడాడు.

కేవలం ఐపీఎల్ ఆడటానికి మాత్రమే తాను ప్రాక్టీస్ చేయట్లేదని, జాతీయ జట్టులో స్థానం కోసమే శ్రమిస్తున్నానని చెప్పాడు. ‘నేను ఎప్పుడూ నాతో పోరాడుతూనే ఉంటాను. జాతీయ జట్టులో స్థానాన్ని ఎలాగైనా తిరిగి సంపాందించాలనేదే నా కోరిక. ఎప్పటికైనా మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక కాగలననే నమ్మకం ఉంది. దానికి సిద్ధంగా ఉండేందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నాను.

కేవలం ఐపీఎల్ ఆడటం నా లక్షం కాదు. జాతీయ స్థాయిలో రాణించడమే నా లక్షమ’ని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మిశ్రా చివరిగా 2017 ఫిబ్రవరిలో భారత్ తరుపున టీ20 ఆడాడు. 2016లో చివరిగా టెస్ట్‌లలో కనిపించాడు. అప్పటి నుంచి మిశ్రా భారత జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

కాగా ఐపీయల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన మిశ్రా , ఇండియన్ క్రికెట్ లోకి వస్తూ పోతు ఉన్నాడు ..జడేజా , అశ్విన్ వంటి బౌలర్లు టీంలో ఉండటంతో మిశ్రాకు జట్టులో చోటు దక్కడం కష్టం అయింది ..

Tags :

Advertisement