Advertisement

  • కమలా హారిస్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు

కమలా హారిస్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు

By: chandrasekar Wed, 04 Nov 2020 12:41 PM

కమలా హారిస్ విజయం కోసం తమిళనాడులో ప్రత్యేక పూజలు


అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలని తమిళనాడులో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ హోరాహోరీగా తలపడుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రవాస భారతీయురాలు, డెమొక్రాట్ల తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ పార్టీ నేతలతో కలిసి ఆమె అమెరికా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. పోలింగ్‌ ప్రారంభమవడంతో మరికొన్ని గంటల్లో వారి భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ కుటుంబానిది తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లా మన్నార్‌గుడి తాలూకాకు చెందిన తులసేంద్రపురం.

ఈసారి ఎన్నికల్లో కమల హారిస్ విజయం పొందాలని దీనికోసం తమ గ్రామం నుంచి వలసవెళ్లిన కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికాలో ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతుండటాన్ని ఆ గ్రామస్థులు గర్వంగా భావిస్తున్నారు. కమలా హారిస్ గెలుపును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని అయ్యనార్‌ దేవాలయంలో మంగళవారం, నవంబర్ 3 న ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. శివుడి అంశల్లో ఒకరుగా ఈ దేవుడిని కొలుస్తారు. ఊర్లో, గ్రామ శివార్లలో కమలా హారిస్ పేరుతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆమె గెలవాలని కోరుతూ వీటిని ఏర్పాటు చేశారు. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తూ గోడపత్రికలు కూడా ఇక్కడ అంటించారు. ఆమె గెలుపు కోసం ఈ ఊరి ప్రజలంతా వేచి చూస్తున్నారు. ఎన్నికల సర్వేలో డెమోక్రాట్లుకు అనుకూలంగా రావచ్చని చెపుతుంది.

Tags :
|

Advertisement