Advertisement

  • రాజధానుల అంశంపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

రాజధానుల అంశంపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

By: chandrasekar Sat, 08 Aug 2020 5:28 PM

రాజధానుల అంశంపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్


రాజధానుల అంశంపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వేరు వేరు పరిపాలన ప్రాంతాలను ఏర్పాటు చెయ్యడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీలో కార్యాలయాల తరలింపుపై ఈ నెల 4న హైకోర్టు ఇచ్చిన స్టేపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఎక్స్‌పార్టీగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రస్తావించింది.

ప్రాథమిక కారణాలు తెలియచేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపారు. పరిపాలనా వికేంద్రకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులుపై గవర్నర్ జారీ చేసిన గెజిట్‌పై ఏపీ హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశంపై అమరావతి జేఏసీతో పాటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపింది. స్టేటస్కో ఇచ్చి రిప్లై ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. దీనిపైనే సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.

Tags :
|

Advertisement