Advertisement

  • వారెంట్ లేకుండానే తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం గల ప్రత్యేక దళం యూపీలో

వారెంట్ లేకుండానే తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం గల ప్రత్యేక దళం యూపీలో

By: chandrasekar Tue, 15 Sept 2020 6:16 PM

వారెంట్ లేకుండానే తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం గల ప్రత్యేక దళం యూపీలో


కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాదిరిగా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయనున్నది. వారెంట్ లేకుండానే తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం దీనికి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం 'యూపీఎస్ఎస్ఎఫ్' ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోర్టులు, విమానాశ్రయాలు, పరిపాలనా భవనాలు, మెట్రోలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను రక్షించడానికి ఈ దళాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది.

మొదట 8 బెటాలియన్ల యూపీఎస్ఎస్ఎఫ్‌ను ఏర్పాటు చేస్తామని, దీని కోసం రూ.1,747.06 కోట్లు వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్ అవస్థీ ఆదివారం ట్వీట్ చేశారు. యూపీ పోలీసుల ప్రత్యేక విభాగమైన పీఏసీ నుండి మౌళిక సదుపాయాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ఇది సీఎం యోగి ఆదిత్యనాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ సెక్షన్‌లోని 12 మాదిరి అధికారాలతో కొత్తగా ఏర్పాటు చేసే భద్రతా దళానికి వారెంట్ లేకుండా తనిఖీ, అరెస్ట్ చేసే అధికారం ఇవ్వడం వల్ల అది దుర్వినియోగమయ్యే అవకాశమున్నదని పలువురు దీనిని విమర్శిస్తున్నారు.

Tags :

Advertisement