Advertisement

  • కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

By: Sankar Sun, 16 Aug 2020 6:04 PM

కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరంగా ఉండేలా సీట్లు సిద్ధం చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు జూలై 17న ఒక సమావేశం నిర్వహించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ గురించి వీరిద్దరు చర్చించారు. కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు లోక్‌సభ, రాజ్యసభలోని చాంబర్లు, గ్యాలరీలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో వారం నాటికి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

దీంతో ఆ మేరకు ఇరు సభల చాంబర్లు, గ్యాలరీలల్లో సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్యసభ కార్యదర్శి తెలిపారు. ఈ నేపథ్యంలో సభలో నాలుగు పెద్ద తెరలు, నాలుగు గ్యాలరీల్లో మరో ఆరు చిన్న తెరలతోపాటు ఆడియో వ్యవస్థలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

చాంబర్లు, గ్యాలరీలను వేరు చేసేందుకు పాలికార్బోనేట్ షీట్‌లు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లు పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారని రాజ్యసభ కార్యదర్శి పేర్కొన్నారు.

Tags :

Advertisement