Advertisement

అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

By: chandrasekar Fri, 21 Aug 2020 09:37 AM

అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు


కరోనా కారణంగా అన్ని ప్రత్యక్ష సమావేశాలను దాదాపు నిలిపి వేశారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలకు కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీనాటికి ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని అహఁధికారులకు సూచించారు.

వర్షాకాల అసెంబ్లీ సమావేశాల వచ్చే నెల 7 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గురువారం శాసనసభ, శాసనమండలిని పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహచార్యులు పరిశీలించారు. ఎటువంటి సంఘటన జరగకుండా సాంగీక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సమావేశం జరిగే మండలిలో సభ్యులు భౌతికదూరం పాటించేలా సీట్లు సరిపోతాయని చైర్మన్‌ తెలిపారు. ఇంతకు ముందు ఇద్దరు కూర్చున్న సీట్లలో ఈ సారి సమావేశాల్లో భౌతికదూరం పాటించేలా ఒక్కొక్కరు మాత్రమే కూర్చోనున్నారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలను పాటిస్తూ అన్ని సక్రమంగా జరిగేలా చూస్తా మన్నారు.

Tags :

Advertisement