Advertisement

  • ఎస్పీ బాలు ఆరోగ్యం అప్డేట్ విషయంలో అభిమానులను రిక్వెస్ట్ చేసిన ఎస్పీ చరణ్

ఎస్పీ బాలు ఆరోగ్యం అప్డేట్ విషయంలో అభిమానులను రిక్వెస్ట్ చేసిన ఎస్పీ చరణ్

By: Sankar Tue, 25 Aug 2020 9:17 PM

ఎస్పీ బాలు ఆరోగ్యం అప్డేట్ విషయంలో అభిమానులను రిక్వెస్ట్ చేసిన ఎస్పీ చరణ్


కరోనా వ్యాధితో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఈనెల 5 నుంచి చికిత్స తీసుకుంటున్నారు ఎస్పీ బాలు. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న ఎస్పీ బాలు ఆరోగ్యంపై అభిమానులు ఆందోళనకు గురౌతుండటంతో ఎస్పీ చరణ్ ప్రతి రోజు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా అభిమానుల్ని రిక్వెస్ట్ చేశారు చరణ్. ఆయన మాట్లాడుతూ.. ‘చాలా మంది నాన్న క్షేమ సమాచారాన్ని తమిళంలో తెలియజేయాలని కోరుతున్నారు... కాని నాన్నకు ఒక్క తమిళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వేల పాటలు పాడటం వల్ల.. నాన్న ఆరోగ్య పరిస్థితిపై వాళ్లు కూడా ఆందోళలనకు గురౌతున్నారు..

అందుకే అందరికీ ఆయన క్షేమ సమాచారం అందాలనే ఇంగ్లీష్‌లో తెలియజేస్తున్నా.. అన్ని భాషల్లోనూ అప్డేట్స్ అందించడం.. ఇలాంటి పరిస్థితుల్లో కష్టం.. నేను చెప్పేది అర్థం కాని వారు.. అర్థమైన వారి నుంచి తెలుసుకుంటారని కోరుకుంటున్నా.. అందరి ప్రార్ధనలతో నాన్న గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని అన్నారు ఎస్పీ చరణ్.

Tags :
|
|
|

Advertisement