Advertisement

  • ఎస్పీ బాలు ఆరోగ్యంపై శుభవార్త చెప్పిన ఎస్పీ చరణ్ ..

ఎస్పీ బాలు ఆరోగ్యంపై శుభవార్త చెప్పిన ఎస్పీ చరణ్ ..

By: Sankar Mon, 14 Sept 2020 7:47 PM

ఎస్పీ బాలు ఆరోగ్యంపై శుభవార్త చెప్పిన ఎస్పీ చరణ్ ..


గానగంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా పాజిటివ్ రావడంతో చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తోన్న ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈసారి కూడా బాలు ఆరోగ్యం గురించి శుభవార్త చెప్పారు.‌ ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగైనట్లు ఎక్స్‌రేలో కనిపించిందన్నారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరఫిస్టులు ఆయనతో వ్యాయామాలు చేయిస్తున్నారని చరణ్‌ వివరించారు.

ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలనిసినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్ధనలు చేస్తున్నారు..

Tags :
|
|
|

Advertisement