Advertisement

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స

By: chandrasekar Tue, 18 Aug 2020 7:09 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స చేస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించినట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఎస్పీ బాలు ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో 10 రోజులుగా కరోనా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం కుదుటపడింది. తరచూ స్పృహలోకి వస్తున్నారు. మరికొద్ది రోజుల చికిత్స తర్వాత కోలుకుంటారు అని ఆయన కుమారుడు చరణ్‌ సోమవారం ఉదయం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వార్త విన్న అయన అభిమానులంతా సంతోష పడ్డారు.

వీడియో చూసిన వెంటనే తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తదితరులు సంతోషాన్ని వెలిబుచ్చారు. అయితే, బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగానే ఉంది. ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స కొనసాగిస్తున్నాం అని సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఎంజీఎం హెల్త్‌కేర్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ భాస్కరన్‌ ఓ బులిటెన్‌ విడుదల చేశారు. గొప్ప గాయకుడు త్వరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలని అందరూ దేవుడిని వేడుకుంటున్నారు.

Tags :

Advertisement