Advertisement

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్ హేల్త్ బులెటిన్ విడుదల..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్ హేల్త్ బులెటిన్ విడుదల..!

By: Anji Fri, 25 Sept 2020 09:27 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్ హేల్త్ బులెటిన్ విడుదల..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఎంజిఎం వైద్యబృందం తాజాగా మరో హాల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో కూడా బాలు ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. బాలు చికిత్స పొందుతున్న చెన్నై ఎంజిఎం హాస్పిటల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఒక్కొక్కరుగా ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి నుంచి బాలు తీవ్ర జ్వరం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.

ఇప్పటికే ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. 10 మంది మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం బాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు బాలు ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో ఆయన కుటుంబ సభ్యుల, శ్రేయోభిలాషులు, ప్రముఖులు ఎంజీఎం హాస్పిటల్‌కు చేరుకున్నారు.

Tags :

Advertisement