Advertisement

కరోనాను జయించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

By: Dimple Mon, 24 Aug 2020 11:48 AM

కరోనాను జయించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు ఆయన కుమారుడు చరణ్‌ సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఎస్పీబీ కోలుకోవాలని కొన్ని రోజులుగా ప్రార్థిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

కోవిడ్ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి సావిత్రి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందనే సమాచారం అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా పోరాడుతూ ఎస్పీబీ చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించిన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో ఇంటర్నల్‌ మెడిసన్‌, క్రిటికల్‌ కేర్‌, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్‌ డీసీజెస్‌, ఎక్మోకేర్‌లో విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు. వీరంతా అంతర్జాతీయస్థాయి వైద్యులతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారు. యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తీసుకుంటున్న చర్యలపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు.’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

పూల మధ్యలో మద్యం బాటిళ్లు - పట్టుకున్న పోలీసులు

spb,covid19 negative,mgm hospital

కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్‌ పోలీసులు విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా అక్రమార్కులు తమ దందా వీడటం లేదు. విడపనకల్లు ఎస్‌ఐ గోపీ ఆధ్వర్యంలో విడపనకల్లు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు.
పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా తాము మల్లెపూల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులూ తెలిపారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో మల్లెపూల బస్తాలు లోపల చూడగా అందులో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బయటపడ్డాయి. హైవార్డ్స్‌ బాటిళ్లు 87, వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, 8 పీఎం బాటిళ్లు స్వాధీనం చేసున్నారు. ఎస్‌ఐ గోపీ కేసు నమోదు చేసి కారు, మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు.
స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సూపరిండెంట్‌ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్‌ సీఐ శ్యాంప్రసాద్, విడపనకల్లు ఇన్‌స్పెక్టర్‌ భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, నాగేంద్ర ద్విచక్రవాహనంలో 40 విస్కీ బాటిళ్లు, 96 హైవార్డ్స్‌ విస్కీ బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు.
వీరి నుంచి మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన అశోక్, మంజునాథ్‌ల నుంచి 192 హైవార్డ్స్‌ విస్కీ టెట్రా ప్యాకెట్లు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామ శివార్లలో పాల్తూరు గ్రామానికి చెందిన నాగరాజు వద్ద 96 విస్కీ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది రియాజ్‌ అహ్మద్, వెంకటేష్, రమేష్‌బాబు, రామకృష్ణ, వీరారెడ్డి, మౌలాలి, శైలజలు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement