Advertisement

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ..

By: Sankar Thu, 11 June 2020 5:12 PM

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ..



తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు నిజామాబాద్‌ జిల్లా వరకు విస్తరించినట్లు పేర్కొంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవననాలు విస్తరించాయి. రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. ఇక రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

monsoon,south west,telangana,kostha andhra,rayalaseema,rain ,నైరుతి రుతుపవనాలు, తెలంగాణ,  నిజామాబాద్‌, రాయలసీమ,  కోస్తాంధ్ర



పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధముగా 7.6 కి. మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైఋతి వైపుకు తిరిగి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందిని పేర్కొంది.

మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర తెలిపింది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు, రేపు అనేక చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Tags :

Advertisement