Advertisement

  • కరోనా బారిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. సిరీస్ రద్దు.. స్వదేశానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు..

కరోనా బారిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. సిరీస్ రద్దు.. స్వదేశానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు..

By: chandrasekar Tue, 08 Dec 2020 08:43 AM

కరోనా బారిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. సిరీస్ రద్దు.. స్వదేశానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు..


దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు కరోనా సోకడంతో సిరీస్ రద్దు చేయబడింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు స్వదేశానికి బయలుదేరారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లాండ్ పర్యటన అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 3-0 తేడాతో ఇంగ్లాండ్ కైవసం చేసుకోగా డిసెంబరు 4 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతూ వచ్చారు. దాంతో డిసెంబరు 4న జరగాల్సిన తొలి వన్డేని డిసెంబరు 6కి తొలుత వాయిదా వేశారు. కానీ ఈ మ్యాచ్ ముంగిట మళ్లీ సఫారీ టీమ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లోని సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారినపడటంతో క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిరీస్‌ని రద్దు చేస్తున్నట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. వాస్తవానికి ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ పతాక స్థాయిలో వ్యాపిస్తున్న రోజుల్లోనే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజయవంతంగా సిరీస్‌లను నిర్వహించింది.

అప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకి వచ్చిన వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడం దగ్గర నుంచి ఇరు జట్ల ఆటగాళ్లని బయో-సెక్యూర్ బబుల్‌లో ఉంచడం మరియు ట్రావెల్, హోటల్ సిబ్బందితో ఆటగాళ్లకి అటాచ్‌మెంట్ లేకుండా చూడటంతో ఈసీబీ తగు జాగ్రత్తలు తీసుకుంది. కానీ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అలా జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిలైంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ని కూడా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి త్వరలోనే ఇంగ్లాండ్ క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు. ఆ తర్వాత జనవరిలో ఇంగ్లాండ్ టీమ్ సుదీర్ఘ సిరీస్ కోసం భారత్‌కి రానుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం మంచి ఫారం లో వున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ముందుకి దూసుకెళుతుంది.

Tags :
|

Advertisement