Advertisement

  • సచిన్ తొలి బంతికి స్ట్రైకింగ్ తీసుకోకపోవడం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన గంగూలీ ..

సచిన్ తొలి బంతికి స్ట్రైకింగ్ తీసుకోకపోవడం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన గంగూలీ ..

By: Sankar Mon, 06 July 2020 2:57 PM

సచిన్ తొలి బంతికి స్ట్రైకింగ్ తీసుకోకపోవడం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన గంగూలీ ..



సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ ప్రపంచ వన్ డే క్రికెట్ చరిత్రలో అత్యుతమా ఓపెనర్లు ..ఎన్నో మ్యాచ్ లలో తమ అద్భుత భాగస్వామ్యంతో టీమిండియాకు అనేక విజయాలను అందించారు ..అయితే ఈ ఇద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం లో గాని , ఆ తర్వాత సెహ్వాగ్ తో ఓపెనింగ్ లో గాని సచిన్ ఎక్కువగా ఇన్నింగ్స్ తొలి బంతికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉండేవాడు .దీనికి గల ఆసక్తికర విషయాలను గంగూలీ పంచుకున్నాడు ..

భారత టెస్టు జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో తాజాగా ఫ్రీవీలింగ్ ఛాట్‌లో సౌరవ్ గంగూలీ మాట్లాడుతుండగా.. వన్డేల్లో ఫస్ట్ బంతికి స్ట్రైక్ తీసుకోవాల్సిందిగా సచిన్ ఒత్తిడి తీసుకొచ్చేవాడా.. అని మయాంక్ అగర్వాల్ ప్రశ్నించాడు. దానికి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ అవును.. దానికి సచిన్ రెండు కారణాలు చెప్పేవాడు. మొదటిది.. అతను మంచి ఫామ్‌లో ఉంటే దాన్ని కొనసాగించాలి.. కాబట్టి.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉంటాను అనేవాడు. రెండోది.. ఫామ్‌లో లేకుండా ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాన్‌స్ట్రైక్‌లో ఉంటాను అనేవాడు.

మొత్తంగా.. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా అతని వద్ద సమాధానం మాత్రం ఉండేది. కొన్నిసార్లు అతని కంటే వేగంగా వెళ్లి నాన్‌‌స్ట్రైక్‌ ఎండ్‌‌లో నిల్చోవాలని ట్రై చేశా. కానీ.. అప్పటికే అతను టీవీల్లో కనిపించేవాడు. దాంతో.. స్ట్రైక్ ఎండ్‌వైపు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చేది. అయితే.. ఓ రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అతని కంటే వేగంగా వెళ్లి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో నిల్చొన్నాను అని గంగూలీ వెల్లడించాడు.

Tags :
|

Advertisement