Advertisement

  • ఐపీయల్ లో ధోని , రోహిత్ కు కెప్టెన్లుగా ఉన్న స్వేచ్ఛ నాకు అప్పట్లో ఇవ్వలేదు ..సౌరవ్ గంగూలీ

ఐపీయల్ లో ధోని , రోహిత్ కు కెప్టెన్లుగా ఉన్న స్వేచ్ఛ నాకు అప్పట్లో ఇవ్వలేదు ..సౌరవ్ గంగూలీ

By: Sankar Fri, 10 July 2020 4:22 PM

ఐపీయల్ లో ధోని , రోహిత్ కు కెప్టెన్లుగా ఉన్న స్వేచ్ఛ నాకు అప్పట్లో ఇవ్వలేదు ..సౌరవ్ గంగూలీ



సౌరవ్ గంగూలీ ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతం అయినా కెప్టెన్ లలో ఒకడు కష్టకాలంలో ఉన్న ఇండియా జట్టు బాధ్యతలను భుజానికి వేసుకొని ప్రపంచ క్రికెట్ లో ఒక అగ్ర జట్టుగా నిలబెట్టాడు ..ఎందరో యువ ఆటగాళ్లు గంగూలీ సారధ్యంలో అత్యున్నత ఆటగాళ్లుగా ఎదిగారు ..అయితే ఇండియన్ టీం కు ఇంత సక్సెఫుల్ కెప్టెన్ అయినా కూడా ఐపీయల్ లో మాత్రం కెప్టెన్ గా అంతగా రాణించలేకపోయాడు ..అయితే తాజాగా ఐపీయల్ కెప్టెన్సీ గురించి గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..

కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని యాజమాన్యాన్ని కోరినా.. అది జరగలేదని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ యూట్యూబ్ చానెల్‌తో జ‌రిగిన ఇంట‌ర్య్వూలో పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా 2009లో తనని కేకేఆర్‌ కెప్టెన్‌గా తొలగించడానికి గల కారణాలను కూడా గుర్తుచేసుకున్నాడు. 'గౌతమ్ గంభీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్‌కతాకు కెప్టెన్‌ అయ్యాక షారుఖ్‌ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్‌ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని నేను ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే షారుఖ్‌ను అడిగాను. కానీ అది జరగలేదు.

అదే స‌మ‌యంలో మిగ‌తా ఐపీఎల్ ఫ్రాంఛైజీల యాజమాన్యాలు వారి ఆట‌గాళ్ల‌కు పూర్తి స్వేచ్చ‌నిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్‌ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌లుగా కొనసాగుతున్నారు.

అప్పుడు నన్ను కెప్టెన్‌గా తొలగించడానికి కోచ్‌ జాన్‌ బుచనన్‌ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు. ఐపీఎల్‌ తొలి సీజన్‌ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, అది నా వల్ల మాత్రం కాదు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమే' అని గంగూలీ తెలిపాడు..

Tags :
|

Advertisement