Advertisement

  • చాపెల్ కు నన్ను తొలగించేంత పవర్ లేదు ..బీసీసీఐ లో నాకు వ్యతిరేకంగా కొందరు పని చేసారు... గంగూలీ

చాపెల్ కు నన్ను తొలగించేంత పవర్ లేదు ..బీసీసీఐ లో నాకు వ్యతిరేకంగా కొందరు పని చేసారు... గంగూలీ

By: Sankar Sun, 12 July 2020 4:23 PM

చాపెల్ కు నన్ను తొలగించేంత పవర్ లేదు ..బీసీసీఐ లో నాకు వ్యతిరేకంగా కొందరు పని చేసారు... గంగూలీ



భారత దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ 2005 లో తన కెరీర్ లోనే గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు ..అప్పటివరకు ఇండియన్ క్రికెట్లో మకుటం లేని మహారాజుగా ఏలిన గంగూలీ 2003 ప్రపంచ కప్ లో ఇండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు ..ఆ తర్వాత తానే ఏరికోరి తెచ్చిన కోచ్ గ్రెగ్ చాపెల్ తననే టీం నుంచి తొలగించాడు ..అప్పట్లో దీనిమీద తీవ్ర విమర్శలు చెలరేగాయి ..అయితే 2007లో ప్రపంచకప్‌‌ని గెలవాలని తాను ఆశించినట్లు గంగూలీ చెప్పుకొచ్చాడు. కానీ.. మధ్యలోనే తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే టెస్టు జట్టు నుంచి కూడా వేటు వేశారని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ కారణంగానే గంగూలీపై వేటు పడిందని అంతా అనుకున్నారు. కానీ.. బీసీసీఐలోని కొంత మంది కూడా తనకి వ్యతిరేకంగా పావులు కదిపారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ వెల్లడించాడు..

బెంగాల్‌ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘‘జింబాబ్వే పర్యటనని విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి రాగానే.. వన్డే కెప్టెన్సీ నుంచి నన్ను తప్పించారు. నా కెరీర్‌లో అదో గట్టి ఎదురుదెబ్బ. ఫస్ట్ వన్డేల నుంచి ఆ తర్వాత టెస్టు జట్టు నుంచి కూడా నన్ను తప్పించారు. నాపై అలా వేటు పడటంలో అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ క్రియాశీలక పాత్ర పోషించాడు.

కానీ.. అతడ్ని మాత్రమే నిందించలేము . ఎందుకంటే.. ఒక విదేశీ కోచ్‌కి.. టీమిండియా కెప్టెన్‌ని మార్చే పవర్‌ని బీసీసీఐ ఇవ్వదు. కాబట్టి.. బీసీసీఐలోని పెద్దల మద్దతుతోనే ఆ మొత్తం వ్యవహారం జరిగిందని నేను అర్థం చేసుకోగలను. అన్యాయంగా నాపై వేటు వేశారనేది నిజం. ప్రతిసారి న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కానీ.. జింబాబ్వే పర్యటనలో నా కెప్టెన్సీలో భారత్ జట్టు గెలిచిన తర్వాత.. నాపై వేటు పడటం జీర్ణించుకోలేని అంశం’’ అని గంగూలీ వెల్లడించాడు.అయితే ఆ తర్వాత తిరిగి టీంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన గంగూలీ పరుగుల వరద పారిచాడు ..ఆ తర్వాత రెండేళ్ల పాటు మ్యాచ్‌లాడిన గంగూలీ 2008లో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో రిటైర్మెంట్‌ ప్రకటించాడు

Tags :
|
|

Advertisement