Advertisement

ఐపీయల్ కోసం యూఏఈ బయల్దేరిన బీసీసీఐ బాస్ ..

By: Sankar Wed, 09 Sept 2020 4:53 PM

ఐపీయల్ కోసం యూఏఈ బయల్దేరిన బీసీసీఐ బాస్ ..


ఐపీఎల్ 13వ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈలో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు అక్క‌డికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొద‌లుపెట్టాయి. ఈ సంద‌ర్భంగా టీమిండియా మాజీ ఆట‌గాడు.. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఐపీఎల్ 2020కి సంబంధించిన ప‌నులను ప‌ర్య‌వేక్షించ‌డానికి యూఏఈకి వెళ్లాడు. దాదాపు 6 నెల‌ల క‌రోనా విరామం త‌ర్వాత విదేశానికి ప‌య‌న‌మైన‌ట్లు సౌర‌వ్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. ఈ నేప‌థ్యంలో విమానంలో తాను ప్ర‌యాణిస్తున్న ఫోటోల‌ను గంగూలీ బుధ‌వారం ఇన్‌స్టాలో‌ షేర్ చేశాడు..

6 నెల‌ల కాలంలో తొలిసారి విమాన ప్ర‌యాణం చేస్తున్నా.. జీవ‌న‌శైలి పూర్తిగా మారిపోయింది.. ఇంత‌కముంద‌లా మాత్రం లేదు.. ఫేసుకు మాస్కుతో పాటు ఇత‌ర అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని విమానం ఎక్కాను. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోల‌నే మీతో షేర్ చేసుకుంటున్నా' అంటూ తెలిపాడు. ఇప్ప‌టికే ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ స‌హా ఇత‌ర అధికారులు దుబాయ్‌లోనే ఉండి లీగ్‌కు సంబంధించిన ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కాగా సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ లో ఐపీయల్ పదమూడవ సీజన్ ప్రారంభం కానుంది..అయితే కరోనా కారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రేక్షకులు ఎవరు లేకుండా ఈ సారి ఐపీయల్ నిర్వహిస్తున్నారు..అయితే ఎన్ని ఏర్పాట్లు చేసిన కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది..ఇప్పటికే చెన్నై ఆటగాళ్లు కరోనా బారిన పడి కోలుకున్నారు

Tags :
|
|

Advertisement