Advertisement

  • మూడు నెలలు టైం ఇవ్వండి ..మైదానంలో మళ్ళీ పాత గంగూలీని చూయిస్తా ...

మూడు నెలలు టైం ఇవ్వండి ..మైదానంలో మళ్ళీ పాత గంగూలీని చూయిస్తా ...

By: Sankar Fri, 17 July 2020 8:49 PM

మూడు నెలలు టైం ఇవ్వండి ..మైదానంలో మళ్ళీ పాత గంగూలీని చూయిస్తా ...



సౌరవ్ గంగూలీ ఇండియన్ క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు ..కెప్టెన్ గా , బాట్స్మెన్ గా గంగూలీ ఒక వెలుగు వెలిగాడు ..అయితే గంగూలీ చివరి సారిగా 2008 లో నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగాడు ..ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు ..అయితే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పుడు కూడా తాను సిద్ధమని ఈ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు వెల్లడించాడు.

నాగ్‌పూర్ టెస్టుతో నేను వీడ్కోలు తీసుకోకుండా ఉండింటే..? తర్వాత రెండు సిరీస్‌ల్లోనూ పరుగులు రాబట్టేవాడ్ని. ఇప్పుడు కూడా ఓ ఆరు నెలలు ట్రైనింగ్‌కి టైమివ్వండి.. ఓ మూడు రంజీ మ్యాచ్‌లాడి ఫామ్ అందుకుని టీమిండియా ఆడి పరుగులు సాధిస్తాను. వాస్తవానికి ఆరు నెలలు కూడా అవసరం లేదు.. మూడు నెలలు ఇవ్వండి చాలు. మెరుగైన స్కోర్లు చేస్తాను. అప్పట్లో వన్డేల్లో ఆ ఏడాది టాప్ స్కోరర్‌గా నిలిచాను. కానీ.. నమ్మశక్యంకాని రీతిలో టీమ్ నుంచి నన్ను తప్పించారు’’ అని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.

గంగూలీ కెప్టెన్సీలోని భారత్ జట్టు జింబాబ్వే పర్యటనకి వెళ్లి సిరీస్‌ని గెలిచింది. కానీ.. టీమిండియా ఆ టూర్‌ని నుంచి ఇక్కడికి రాగానే గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే వన్డే జట్టులోనూ అతను చోటు కోల్పోగా.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన గంగూలీ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ కారణంగా గంగూలీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Tags :
|
|
|
|

Advertisement