Advertisement

త్వరలో టెలికాం కంపెనీల చార్జీల మోత...

By: chandrasekar Tue, 17 Nov 2020 5:09 PM

త్వరలో టెలికాం కంపెనీల చార్జీల మోత...


త్వరలోనే దేశీయ టెలికాం సేవల కంపెనీలు చార్జీల మోత మోగించనున్నాయి. వచ్చే నెల లేదా 2021 జనవరిలో మొబైల్‌ టారి్‌ఫలు 15-20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధాన టెలికాం కంపెనీలు మూడే మూడు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో. ఈసారి మొబైల్‌ చార్జీల పెంపు వి తో మొదలు కానుందని ఎయిర్‌టెల్‌, జియో సైతం అ దేబాటలో పయనించనున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో చార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని, దీర్ఘకాలం పాటు కంపెనీ కార్యకలాపాల కొనసాగింపునకు ఇది సహేతుకం కాదని వి ఎండీ రవీందర్‌ టక్కర్‌ గతంలో అభిప్రాయపడ్డారు. మిగతా కంపెనీల కంటే ముందు తామే చార్జీలను పెంచేందుకూ వెనుకాడబోమని ఆయన సంకేతాలిచ్చారు. ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విఠల్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, మిగతా కంపెనీల కంటే ముందు చార్జీలను పెంచే ఉద్దేశం తమకు లేదన్నారు. చివరిసారిగా 2019 డిసెంబరులో మొబైల్‌ కంపెనీలు చార్జీలు పెంచాయి. 2016లో రిలయన్స్‌ జియో టెలికాం సేవలను ప్రారంభించిన తర్వాత టారి్‌ఫలు పెరగడం అదే తొలిసారి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో మొబైల్‌ సేవలు మరింత ప్రియం కావచ్చని, చార్జీల పెంపు తప్పదని కొద్దినెలలుగా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Tags :
|

Advertisement