Advertisement

  • జీవితం వృత్తం లాంటిది ..ట్విట్టర్ లో వైరల్ అయిన తన ఓల్డ్ పాస్ పై సోను సూద్ వ్యాఖ్యలు

జీవితం వృత్తం లాంటిది ..ట్విట్టర్ లో వైరల్ అయిన తన ఓల్డ్ పాస్ పై సోను సూద్ వ్యాఖ్యలు

By: Sankar Sat, 30 May 2020 5:48 PM

జీవితం వృత్తం లాంటిది ..ట్విట్టర్ లో వైరల్ అయిన తన ఓల్డ్ పాస్ పై సోను సూద్ వ్యాఖ్యలు

లాక్ డౌన్ సమయం లో తనకు చేతనైనంత సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న నటుడు సోను సూద్ ..వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు పంపడం కోసం తీవ్రంగా శ్రమించాడు ..దీనితో నెటిజన్లు సూను సూద్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

తాజాగా సోను సూద్ ఇండస్ట్రీ లో నిదొక్కుకోకముందు ఎంతటి సాధారణ జీవితం అనుభవించాడో తెలుపుతూ ఒక వ్యక్తి సూను సూద్ వాడిన రైల్వే మంత్లీ పాస్ ను ట్విట్టర్ లో పెట్టాడు ..దీనితో ఆ ట్వీట్ వైరల్ అయింది , కష్టం విలువ తెలిసిన వాడే ఇతరులకు సాయం చేస్తాడు అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు ..

ఈ భావోద్వేగ ట్వీట్‌కు సోనుసూద్ రిట్వీట్ చేస్తు జీవితం వృత్తం లాంటిదని పేర్కొంటు అందరి హృదయాలను దోచుకున్నాడు. ఆయన రీట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు రుబి శర్మ అనే నెటిజన్‌ స్పందిస్తు.. మీరు ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు అందరి మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నారు. మీకు అలసట రాదా సార్‌ అని ప్రశంసల వర్షం కురిపించాడు. మీరు చేస్తున్న సేవలు అమోఘమని సోనూసూద్‌ పై తనకున్న అభిమానాన్ని చాటాడు.

Tags :
|
|

Advertisement