Advertisement

  • తన జీవిత కథను తానే స్వయంగా రాసుకుంటున్న 'సోను సూద్'

తన జీవిత కథను తానే స్వయంగా రాసుకుంటున్న 'సోను సూద్'

By: chandrasekar Fri, 13 Nov 2020 10:42 AM

తన జీవిత కథను తానే స్వయంగా రాసుకుంటున్న 'సోను సూద్'


తన జీవిత కథను తానే స్వయంగా సోను సూద్ రాసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో నిస్వార్థ సేవ చేసి రియల్ హీరో అనిపించుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ తన జీవిత కథను స్వయంగా రాసుకుంటున్నారు. తన ఆటోబయోగ్రఫీకి టైటిల్‌ను ఖరారు చేశారు. ‘I Am No Messiah’ అని టైటిల్ పెట్టారు. అంటే ‘నేను మహానుభావుడిని కాదు’ అనే అర్థం వస్తుంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సోనూ సూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది వలస కార్మికులను ఆయన ఆదుకున్నారు. తన సొంత ఖర్చులతో కరోనా సమయంలో వలస కార్మికులందరినీ బస్సులు, రైళ్లు, విమానాల్లో వారి స్వస్థలాలకు సోనూ సూద్ చేర్చారు. ఇది మాత్రమే కాదు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చిత్తూరు జిల్లాకు చెందిన దళిత రైతుకు ట్రాక్టర్, వరంగల్ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. డబ్బు గురించి అస్సలు ఆలోచించకుండా ఆర్థికంగా చాలా మందిని సోనూ సూద్ సహాయం చేసి ఆదుకున్నారు. సోనూ సూద్ చేసిన ఈ నిస్వార్థమైన సేవకు గాను ‘వలస కార్మికుల పాలిట దేవుడు’గా ఆయన్ని ఎంతో మంది కొలిచారు.

చాలా మంది పేదలకు మరియు నిరుద్యోగులకు చాలా సహాయం చేసి మంచి మన్ననలు పొందారు. ఇలా ఎంతో మంది అడిగినవారికి మరియు అడగని వారికీ సహాయం చేశారు. కానీ ఇప్పుడు తన జీవిత కథను తానే స్వయంగా రాసుకోవాలని సోనూ సూద్ నిర్ణయించుకోవడం, దానికి ‘I Am No Messiah’ అని టైటిల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పుస్తకంలో కరోనా మహమ్మారి సమయంలో తన అనుభవాలను ప్రస్తావించనున్నారు సోనూ సూద్. తన ఆటోబయోగ్రఫీకి ‘I Am No Messiah’ అని టైటిల్‌ను ఎంపిక చేసుకోవడం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ ‘‘ప్రజలు చాలా మంచి వారు. వారికి సాయం చేసినవారి పట్ల ఎంతో అభిమానం చూపిస్తారు. అందుకే ప్రేమతో నన్ను ‘మహామనిషి’గా పిలుచుకుంటున్నారు. కానీ, నేను మహానుభావుడిని కానని నేను బలంగా నమ్ముతాను. నా మనసు ఏం చెప్పిందో అదే నేను చేశాను. ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మనషులుగా మన బాధ్యత అని చెప్పుకొచ్చారు. కాగా, సోనూ సూద్ తన పుస్తకాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. అయన చేసిన సహాయానికి ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా మెచ్చుకున్నారు.


Tags :
|

Advertisement