Advertisement

సోను సూద్ మనిషి రూపంలో ఉన్న దేవుడు..

By: Sankar Fri, 21 Aug 2020 10:35 AM

సోను సూద్ మనిషి రూపంలో ఉన్న దేవుడు..


సోను సూద్ ..ఇపుడు దేశం మొత్తం వినిపిస్తున్నపేరు ..ఆయనను పొగడటానికి పదాలు కూడా దొరకడం లేదు ..ఒకటి రెండు సాయాలు చేస్తే గొప్ప అనే ఈ రోజుల్లో అసలు సోను మనిషేనా లేదా మనిషి రూపంలో ఉన్న దేవుడా అనేంతలా అడిగిన వారికల్లా సాయం చేసుకుంటూ వెళ్తున్నాడు..తాజాగా బిహార్ వరదల్లో నష్టపోయిన కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. అంతేకాదు తన జీవితంలో తొలిసారిగా కారు కొనుక్కునప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదంటూ ప్రకటించారు.

బిహార్ చంపారన్ లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం, కన్న కొడుకుని, కుటుంబ ఏకైన ఆదాయ వనరు అయిన గేదెను కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్ యుద్ధ ప్రాతిపదకన స్పందించారు. తక్షణమే వారికి ఒక కొత్త గేదె అందేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, వీరి కోసం కొత్త గేదెను కొంటున్నపుడు కలిగిన ఆనందం తన తొలి కారు కొన్నపుడు కలగలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను బిహార్ వచ్చినపుడు ఈ గేదె ఒక గ్లాసు తాజా పాలు తాగుతానంటూ ట్వీట్ చేశారు..

మరో ఘటనలో క్వారంటైన్ నిబంధనలతో హోటల్ లో చిక్కుకున్న ఫ్యామిలీకి కూడా సోనూసూద్ అండగా నిలిచారు. కరోనా నెగిటివ్ వచ్చినా తరువాత కూడా 3 సంవత్సరాల కుమార్తెతో సింగ్రౌలిలోని హోటల్‌లో ఉండిపోయామని, సాయం చేయమంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర శిశు మహిళా శాఖను ఉద్దేశించి నిఖితా హరీష్ ట్వీట్ చేశారు.

కరోనా పాజిటివ్ రావడంతో 60 రోజుల నవజాత శిశువుతో పాటు తన భార్య ఆసుపత్రికి తరలించారన్నారు. బెంగతో తన చిన్నారి తిండి కూడా తినడం లేదని ఎలాగైనా తమకు ఇంటికి చేర్చాలంటూ అభ్యర్థించారు. మరో గంటలో మీరు ఇంటికి బయలుదేరబోతున్నారు. బ్యాగులు సర్దుకోమంటూ సోనూ సూద్ వారికి భరోసా ఇచాచ్చారు. అన్నట్టుగానే హరీష్ సంతోషంగా ఇంటికి చేరడం విశేషం. అంతేనా..సోనూ సూద్ ట్విటర్ ను పరిశీలిస్తే..ఇలాంటి విశేషాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మీరు దేవుడు అంటూ సహాయం పొందిన వారి కృతజ్ఙతా పూర్వక కన్నీళ్లు ఉంటాయి. కానీ ఆయన మాత్రం తాను మానవమాత్రుడినే అంటారు.

Tags :
|
|
|

Advertisement