Advertisement

  • ప్రజలను మోసం చేస్తున్నందుకు మీరు త్వరలోనే అరెస్ట్ కావడం తథ్యం ..వార్నింగ్ ఇచ్చిన సోను సూద్

ప్రజలను మోసం చేస్తున్నందుకు మీరు త్వరలోనే అరెస్ట్ కావడం తథ్యం ..వార్నింగ్ ఇచ్చిన సోను సూద్

By: Sankar Fri, 21 Aug 2020 10:40 PM

ప్రజలను మోసం చేస్తున్నందుకు మీరు త్వరలోనే అరెస్ట్ కావడం తథ్యం ..వార్నింగ్ ఇచ్చిన సోను సూద్


అడిగినవారికల్లా కాదనకుండా సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోను సూద్..తమకు సాయం కావాంటూ సోనూ సూద్‌ను ట్విటర్‌ వేదికగా నేరుగా కోరుతున్నారు. వాటికి సోనూ సూద్‌ వెంటనే స్పందించి తగిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొంతమంది ఆకతాయిలు ఆయన పేరు మీద నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను క్రియోట్‌ చేశారు. దీనిపై సోను స్పందించాడు..

తన పేరుపై ఉన్న నకిలీ ఖాతా నుంచి అందరూ అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఆకతాయిలు నా పేరు మీద నకిలీ ఖాతాను క్రియోట్‌ చేశారు. ఈ ఫేక్‌ అకౌంట్‌ను ఎవరూ కూడా ఫాలో కాకండి. ఇప్పటికీ ఫాలో అవుతున్న వారు దానిని అన్‌ఫాలో చేయండి. మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ’ ట్వీట్‌ చేశారు. అదే విధంగా ఈ నకిలీ ఖాతాను క్రియోట్‌ చేసిన సదరు ఆకతాయిలకు కూడా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రజలను మోసం చేస్తున్నందుకు త్వరలోనే మీరు అరెస్ట్ కావడం తథ్యం డియర్ అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఇకనైనా మీ మోసాలు ఆపేయాలని, ఆలస్యమైతే ఆ తర్వాత స్పందించినా ఉపయోగం ఉండదన్నారు. 'సోనూ సూద్' అనే ట్విటర్ అకౌంట్ పేరుతో సదరు వ్యక్తి ఇతరుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తున్నట్టు వెల్లడైంది. అంతేకాదు, నకిలీ జీమెయిల్ ఐడీలను ఇస్తూ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు

Tags :
|
|

Advertisement