Advertisement

  • ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల గోవాకు వెళ్లిన సోనియా గాంధీ

ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల గోవాకు వెళ్లిన సోనియా గాంధీ

By: chandrasekar Sat, 21 Nov 2020 10:32 AM

ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల గోవాకు వెళ్లిన సోనియా గాంధీ


ఢిల్లీలో వాయు కాలుష్యం అధికమవ్వడం వల్ల సోనియా గాంధీ గోవాకు వెళ్లారు. ఢిల్లీ కాలుష్యంతో ఇబ్బంది పడుతోన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గోవా వెళ్లారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న వేళ నగరానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించడంతో విశ్రాంతి కోసం ఆమె శుక్రవారం, నవంబర్ 20 మధ్యాహ్నం గోవా బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగేంత వరకు సోనియా అక్కడే ఉండనున్నట్టు సమాచారం. సోనియా వెంట కాంగ్రెస్ అగ్రనేత, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. గోవా వెళ్లడానికి ముందు సోనియా గాంధీ 3 కమిటీలను వేశారు. పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలికి ఈ కమిటీలు సూచనలు ఇవ్వనున్నాయి. ఆర్థిక రంగం, విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఈ కమిటీలు అధ్యక్షురాలికి సూచనలు ఇవ్వనున్నాయి.

ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఈ మూడు కమిటీల్లోనూ ఒక సభ్యుడిగా చేర్చడం గమనార్హం. బిహార్ ఎన్నికల్లో వైఫల్యంపై పార్టీ నేత కపిల్ సిబల్ బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మన్మోహన్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల కమిటీలో పి చిదంబరం, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్ ఉండగా విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌, సల్మాన్‌ ఖుర్షిద్‌, సప్తగిరి ఉలక ఉన్నారు. ఇక జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో గులాం నబీ ఆజాద్‌‌, వీరప్ప మొయిలీ, విన్సెంట్‌ పాల, వైతిలింగం ఉన్నారు. సోనియా గాంధీ ఊపిరితిత్తుల సమస్య వల్ల అనారోగ్యం పాలవడంతో ఢిల్లీలో కాలుష్యం బారిన పడకుండా గోవాకి వెళ్లినట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement