Advertisement

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోనియా గాంధీ

By: chandrasekar Mon, 24 Aug 2020 2:56 PM

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోనియా గాంధీ


ఏఐసీసీ తాత్కాలిక‌ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మ‌రో అధ్య‌క్షుడ్ని ఎన్నుకోవాల‌ని స‌భ్యుల‌కు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంత‌మైన‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయిన‌ట్లు స‌మాచారం.

అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్‌ పేరును ప్రతిపాదించారు.

అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. కొత్త అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నుకోబడతారో వేచి చూడాల్సిందే మరి.

Tags :

Advertisement