Advertisement

  • సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని అరెస్ట్

సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని అరెస్ట్

By: chandrasekar Sat, 22 Aug 2020 5:07 PM

సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని అరెస్ట్


ముంబై పోలీసులు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సోనాక్షిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేసాడు.

ఆ పోస్ట్ సోనాక్షి సిన్హా దృష్టికి రావడంతో అతడిపై ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన సోనాక్షి పోలీసులకు ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.

''ఆన్‌లైన్ ప్రపంచం సేఫ్‌గా ఉండే వరకూ నేను సైలెంట్‌గా ఉండను, ఆన్ లైన్ వేధింపులను సహించను. అందుకే ఫిర్యాదు చేసాను. నా ఫిర్యాదు అందిన వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకున్నారు, వారికి అభినందనలు'' అంటూ సోనాక్షి ఆ వీడియోలో చెప్పకొచ్చింది. అంతేకాదు ఏవరైనా ఇలా సోషల్ మీడియాలో వేధింపులకు గురైతే ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ తన ఫాలోవర్స్‌కు తెలిపింది.

Tags :

Advertisement