Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుమారుడు ..

కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుమారుడు ..

By: Sankar Sat, 25 July 2020 1:38 PM

కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుమారుడు ..



కరోనా కారణంగా ప్రజల్లో కొద్దో గొప్పో ఉన్న మానవత్వం కూడా పూర్తిగా పోతుంది ..కరోనా వచ్చిన వారితో సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పారు గాని , వారిని అంటారని వారిలాగా చూడమని ఎక్కడ చెప్పలేదు ..అయినా కుడా కరోనా వచ్చిన వారి పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది ..తాజాగా హైద్రాబాద్లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది ..కరోనా ను జయించి ఇంటికి వచ్చిన తల్లిని కుమారుడు లోపలకు రానివ్వలేదు ..

హైదరాబాద్‌ ఫిలింనగర్‌ బీజేఆర్‌ నగర్‌లో ఓ మహిళకు కరోనా వైరస్ నిర్థారణ అయ్యింది. ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్‌ చేశారు. ఆమె సంతోషంతో తిరిగి ఇంటికొచ్చింది.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

ఆ మహిళను కుమారుడు, కోడలు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇంటిపై కప్పుకున్న రేకులు ధ్వంసం చేసి.. ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాపం ఆ మహిళ చేసేదేమీ లేక రోడ్డు పక్కనే బిక్కు బిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఆమెకు సహాయం అందించాలంటూ పోలీసులకు ఫోన్‌ చేసినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు అంటున్నారు. అధికారులు తనకు న్యాయం చేయాలని ఆమె ఆవేదనతో చెప్పారు. కరోనా నుంచి కోరుకున్నా ఆమెను రోడ్డుపాలు చేసిన కొడుకుపై స్థానికులు మండిపడుతున్నారు

Tags :
|
|
|

Advertisement