Advertisement

  • కరోనా సోకితే కంటి చూపు మందగిస్తుంది...వైద్య నిపుణులు

కరోనా సోకితే కంటి చూపు మందగిస్తుంది...వైద్య నిపుణులు

By: Sankar Thu, 31 Dec 2020 10:38 AM

కరోనా సోకితే కంటి చూపు మందగిస్తుంది...వైద్య నిపుణులు


కోవిడ్‌తో కొందరిలో కంటిచూపు మందగిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కంటి నరంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కంటిచూపు తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్కసారిగా చూపు మసకబారడం, కంటి నాళాల్లో గడ్డల ద్వారా రెటీనాకు రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది.

ప్రధానంగా కోవిడ్‌ బారినపడి స్టెరాయిడ్స్‌ వాడి రికవరీ అయినవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. కాబట్టి కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు వస్తే... వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు..

కరోనా నేపథ్యంలో కంటి వైద్య నిపుణులు అత్యవసర కేసులను నేరుగా పరీక్షించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కంటికి దెబ్బ తగలడం, కంట్లో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కనురెప్పల గాయాలు, ఫోటోఫోబియా, ఫ్లోటర్లు, రెటినాల్‌ డిటాచ్మెంట్, రెటినాల్‌ టియర్, వైరల్‌ రెటినిటిస్‌ అత్యవసర వైద్యంగా గుర్తించాలని స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement