Advertisement

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే 50 లక్షలు ఇస్తామన్నారు ..యూపీ డిజిపి సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే 50 లక్షలు ఇస్తామన్నారు ..యూపీ డిజిపి సంచలన వ్యాఖ్యలు

By: Sankar Tue, 06 Oct 2020 10:39 AM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే 50 లక్షలు ఇస్తామన్నారు ..యూపీ డిజిపి సంచలన వ్యాఖ్యలు


హథ్రాస్‌ దుర్ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నాయని యూపీ డీజీపీ(లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలు ఇస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేశామని డీజీపీ వివరించారు..

పొలం పనులకు వెళ్లొస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులానికి చెందిన 14 మంది వ్యక్తులు అత్యాచారం చేసి, దారుణంగా హింసించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.తీవ్రంగా గాయపడిన యువతి ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం మృతి చెందింది. యువతి మరణవార్త బయటికి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులకు కఠిన శిక్షలు పడాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు తీశాయి

Tags :

Advertisement