Advertisement

  • మద్యం ప్రియులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరల్లో మార్పులు

మద్యం ప్రియులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరల్లో మార్పులు

By: chandrasekar Thu, 03 Sept 2020 6:53 PM

మద్యం ప్రియులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరల్లో మార్పులు


మందుబాబులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. మద్యం ధరల్లో చిన్న మార్పులు చేసింది. రూ.190లోపు ఉన్న 180 ఎంఎల్ రేటును తగ్గించింది. రూ.190పై ఉన్న 180 ఎంఎల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.

మద్యం ధరలు అధికంగా ఉండడంవల్ల మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గుచూపుతున్నారని అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించారట. ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే సమాచారం.

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా నిఘా పెట్టారు.

Tags :
|

Advertisement