Advertisement

  • వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ కు ప్రధానతను ఇస్తున్న సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ కు ప్రధానతను ఇస్తున్న సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు

By: chandrasekar Wed, 23 Sept 2020 10:06 AM

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ కు ప్రధానతను ఇస్తున్న సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు


దేశంలో కరోనా వల్ల చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేవిధంగా ఏర్పాట్లు కల్పించింది. ఒక సర్వేలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ కు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులు ప్రధానతను ఇస్తున్నట్లు తెలిసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), అనుబంధ కంపెనీల ఉద్యోగుల్లో అత్యధికులు ఇళ్ల నుంచే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికీ కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని తమ సర్వేలో తేలినట్టు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ (హైసియా) స్పష్టం చేసింది. గత ఆరు నెలల్లో దాదాపు 1000 వెయ్యి మంది వరకు ఫ్రెషర్లను ఉద్యోగాల్లో చేర్చుకున్నట్టు 70 శాతం కంపెనీలు పేర్కొనగా ఇప్పటికే ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని అనేక కంపెనీలు స్పష్టం చేశాయి.

లాక్ డౌన్ ప్రకటించిన తరువాత 95 శాతం ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్లో 90 నుంచి 100 శాతం మందితో ఇంటి నుంచే పనులు చేయించుకుంటున్నాయని, గత రెండు నెలల్లో ఈ ధోరణి మరింత పెరిగిందని హైసియా వెల్లడించింది. ఉద్యోగుల నుంచి 75 శాతం ఉత్పాదకత వస్తున్నదని 80 శాతం కంపెనీలు చెప్పగా 90 శాతం ఉత్పాదకత నమోదవుతున్నట్టు పెద్ద, అతిపెద్ద కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగుల్లో ఆత్మైస్థెర్యం తగ్గడం, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీలో ఇబ్బందులు, విద్యుత్‌ కోతలు, పని వాతావరణం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నాయని 34 శాతం మంది వెల్లడించారు.

Tags :
|

Advertisement