Advertisement

పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు

By: chandrasekar Sat, 03 Oct 2020 6:54 PM

పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు


దేశంలో స్మార్ట్ఫోన్ ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వపు తాజా నిర్ణయంతో రానున్న రోజుల్లో ఫోన్ల ధరలు పెరగొచ్చు. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో ఝలక్. యాపిల్, శాంసంగ్, షావోమి, ఒప్పొ, రియల్‌మి వంటి పలు కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. డిస్‌ప్లేస్, టచ్‌ ప్యానెల్స్‌కు ఇది వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వపు దిగుమతి సుంకం పెంపు కారణంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్ తగలనుంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దిగుమతి సుంకం పెంపు భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయనున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగొచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశీయంగా తయారీని పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిగుమతి సుంకాన్ని పెంచడంతో మొబైల్ ఫోన్ ధరలు పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ధరలు 1.5 శాతం నుంచి 5 శాతం వరకు పెరగొచ్చని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సుంకం పెంపు కారణంగా పండుగ సీజన్‌లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా 2019 ఏప్రిల్ నుంచే ఈ దిగుమతి సుంకాన్ని విధించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దేశీ తయారీ కంపెనీలకు మ్యానుఫ్యాక్చరింగ్‌కు మరింత గడువు ఇచ్చింది. ఇకపోతే కేంద్రం నిర్ణయంతో కొన్ని కంపెనీలు వెంటనే ధరలు పెంచే అవకాశముంది. మరి కంపెనీలు మాత్రం ఈ భారాన్ని సాధ్యమైనంత వరకు భరించే ఛాన్స్ ఉంది. దీనివల్ల మరిన్ని ఫోన్ విడి భాగాలు దేశంలోనే తాయారు చేయడానికి అవకాశం వుంది.

Tags :
|

Advertisement