Advertisement

  • స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు ..భారీగా పెరిగే అవకాశం

స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు ..భారీగా పెరిగే అవకాశం

By: Sankar Fri, 02 Oct 2020 3:46 PM

స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు ..భారీగా పెరిగే అవకాశం


స్మార్ట్‌ఫోన్‌ కొనాలని మీరు భావిస్తుంటే వెంటనే కొనుగోలు చేయడం మేలు. త్వరలో యాపిల్‌, శాంసంగ్‌, షియోమి, ఒపో వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ మొత్తాన్ని వినియోగదారులపైనా వడ్డించనున్నారు.ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించింది.

ప్రభుత్వ నిర్ణయంతో డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకుంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్‌ ధరలు 2 నుంచి 5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగితే పండగ సీజన్‌ డిమాండ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది..

మరోవైపు టీవీల ధరలు భారం కానున్నాయి. టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్‌ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి.

Tags :
|
|
|

Advertisement