Advertisement

  • వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ...స్లాట్ బుకింగ్ ప్రారంభం

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ...స్లాట్ బుకింగ్ ప్రారంభం

By: Sankar Fri, 11 Dec 2020 3:21 PM

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ...స్లాట్ బుకింగ్ ప్రారంభం


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ల బుకింగ్‌ జరగనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేయొచ్చన్నారు..

కాగా ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. స్లాట్‌ బుక్‌ చేసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌ మొరాయిస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Advertisement