Advertisement

  • ఆరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన అరవై ఏళ్ళ వృద్ధుడు

ఆరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన అరవై ఏళ్ళ వృద్ధుడు

By: Sankar Sat, 25 July 2020 6:38 PM

ఆరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన అరవై ఏళ్ళ వృద్ధుడు



ఇటీవల కాలంలో చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి ..అభంశుభం తెలియని చిన్నారుల మీద కాంనిధులు రెచ్చిపోతున్నారు ..మానవత్వం మంట కలిసే విధంగా జరుగుతున్న లైంగిక దాడుల నుంచి జనాలు బుడ్డి తెచుకోకపోగా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు ..తాజాగా ఇలాంటి ఘటననే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ..

ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక‌దాడికి య‌త్నించాడు. ఈ దారుణ సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా బోన‌క‌ల్లు మండ‌లం పెద్ద బీర‌వ‌ల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 62 ఏళ్లు వృద్ధుడు బొల్లె పోగు వెంకటేశ్వర్లు ఈ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పక్కపక్క ఇండ్లు కావ‌డంతో చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి పిలుచుకొని తలుపులు వేసి హత్యచారం చేయబోయాడు.

వృద్ధుడు త‌న సోద‌రిని తీసుకువెళ్లిన విష‌యాన్ని త‌మ్ముడు తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్నారిపై లైంగిక దాడి చేసేందుకు య‌త్నిస్తున్న వృద్ధుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చ‌ట్టం కింద‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Tags :
|

Advertisement