Advertisement

  • టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన ఆరు రాష్ట్రాలు...

టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన ఆరు రాష్ట్రాలు...

By: chandrasekar Sat, 07 Nov 2020 6:28 PM

టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన ఆరు రాష్ట్రాలు...


భారతీయులంతా దిపావళి పండగ కోసం ముందుస్తుగా రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి. కరోనా పరిస్థితి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం కరోనావైరస్ సంక్రమణను మరింతగా పెంచే అవకాశం ఉంది.

నిషేధం విధించిన రాష్ట్రాలు:

ఢిల్లీ: నవంబర్ 5న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా ఈ సారి టపాసులు కాల్చడంపై నిషేధం విధించినట్టు ఆయన తెలిపారు. పండగల కారణంగా కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం మరింతగా పెరిగింది అని అందుకే ప్రజలు ఈ సారి టపాసులు కాల్చడం మానేయాలి అని.. కాలుష్యం వల్ల మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని ఆయన ప్రజలను కోరారు.

కర్ణాటక: నవంబర్ 6వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో దీనిపై అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుని వివరాలు చెబుతాం అని తెలిపారు. కరోనావైరస్ వల్ల ఈ బ్యాన్ విధిస్తున్నట్టు వివరించారు.

మహారాష్ట్ర: ఢిల్లీ ప్రకటన తరువాత మరుసటి రోజు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పౌరులను టపాసులు కాల్చడం నుంచి దూరంగా ఉండమని అని కోరింది. అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని ఈ మేరకు ఒక ప్రకటన చేసి టపాసులు కాల్చేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.

ఒడిశా: నవంబర్ 3వ తేదీన ఒడిశా ప్రభుత్వం టపాసులు అమ్మడం, కాల్చడం నిషేధిస్తున్నట్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్ 10 నుంచి 30 వరకు అమలులో ఉంటాయి.

పశ్చిమ బెంగాల్: నవంబర్ 5వ తేదీన కాళీపూజ, దిపావళి, ఛాత్ పూజ సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. ఎలాంటి అమ్మకాలు చేయకూడదు అని స్పష్టం చేసింది.

రాజస్థాన్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోఖ గెహ్లాట్ అందరి కన్నా ముందు టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు. దీనిపై ఒక ట్వీట్ చేసి ప్రజలకు సమాచారం అందించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Tags :
|
|

Advertisement