Advertisement

  • కరోనా నుంచి తప్పించుకోవాలి అంటే ఆరు అడుగుల దూరం సరిపోదు..

కరోనా నుంచి తప్పించుకోవాలి అంటే ఆరు అడుగుల దూరం సరిపోదు..

By: Sankar Sun, 30 Aug 2020 12:13 PM

కరోనా నుంచి తప్పించుకోవాలి అంటే ఆరు అడుగుల దూరం సరిపోదు..


కరోనా నుంచి బయటపడాలంటే ఆరు అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని ఇప్పటి దాకా మనం అందరం భావించాం కదా. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కోవిడ్‌19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేదా పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని తేలింది. తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్‌ఫార్డ్‌ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడైంది. దీంతో భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Tags :

Advertisement