Advertisement

  • యూఏఈ లో తొలి ఆరు రోజులు నా జీవితంలోనే అత్యంత వరస్ట్ డేస్ ..అశ్విన్

యూఏఈ లో తొలి ఆరు రోజులు నా జీవితంలోనే అత్యంత వరస్ట్ డేస్ ..అశ్విన్

By: Sankar Fri, 04 Sept 2020 12:09 PM

యూఏఈ లో తొలి ఆరు రోజులు నా జీవితంలోనే అత్యంత వరస్ట్ డేస్ ..అశ్విన్


కరోనా కు ముందు క్రికెటర్స్ ఎక్కడ ఉంటె అక్కడ జనం , కేరింతలు , ఆటోగ్రాఫ్లు , ఫోటో గ్రాఫులు ఇలా సందడి మాములుగా ఉండేది కాదు..అభిమానుల నుంచి తప్పించుకోవడానికి క్రికెటర్స్ మారువేషాల్లో బయటకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి..అయితే కరోనా తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది..అభిమానులు లేకుండా అత్యంత కట్టుదిట్టమైన రూల్స్ మధ్య తొలిసారిగా క్రికెట్ ఆడబోతున్నారు..

అయితే వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. క్వారంటైన్‌ అనుభవాన్ని చెత్తగా అభివర్ణించాడు. యూఏఈలో అడుగుపెట్టిన వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన అశ్విన్‌ ఇప్పుడు ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు. అయితే దుబాయ్‌లో తన ఆరు రోజుల క్వారంటైన్‌ అనేది జీవితంలోనే ఒక చెత్త సమయంగా పేర్కొన్నాడు. ‘ ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యూట్యూబ్‌ చానల్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసిన అశ్విన్‌ కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. ‘ గత ఐదు-ఆరు మాసాల నుంచి ఇంటికే పరిమితమయ్యాం. నేను ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంటూ ఈ సంక్షోభాన్ని గడిపా..

నా యూట్యూబ్‌ చానల్‌ పని చేసుకుంటూ దాన్ని ఆస్వాదించా. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో కూడా పాల్గొన్నా. కానీ దుబాయ్‌లో గడిపిన ఆరో రోజులు గడిపిన క్వారంటైన్‌ సమమం మాత్రం చాలా వరస్ట్‌గా గడిచింది. ఇది నా జీవితంలోనే అత్యంత చెత్త సమయంగా చెప్పొచ్చు. తొలి రోజు నా హోటల్‌ పక్కనే ఉన్న లేక్‌ను చూస్తూ గడిపా. అదే సమయంలో బూర్జ్‌ ఖాలిఫాను కూడా వీక్షించాను. అది చాలా అద్భుతం.

కానీ అద్భుతాన్ని పదేపదే చూడటం కూడా విసుగొచ్చింది. ఎన్నిసార్లు రూమ్‌ బాల్కనీలో కూర్చొని దాన్ని చూస్తాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. సాధారణంగా మొబైల్‌ ఫోన్‌తో ఎక్కువ సేపు గడపలేను. చాలాకాలం నుంచి మొబైల్‌ ఫోన్‌ను సాధ్యమైనంత వరకూ దూరంగానే ఉంచుతున్నా. గత వారంలో ఆరు గంటలు మాత్రమే చూశా. ఇది ఈ మధ్యకాలంలో మొబైల్‌తో గడపడం నాకు చాలా ఎక్కువ అనిపించింది’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు

Tags :

Advertisement