Advertisement

  • స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ లో తీర్మానం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ లో తీర్మానం

By: Sankar Fri, 04 Dec 2020 7:51 PM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ లో తీర్మానం


ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీర్మాణాన్ని ప్రవేశ పెట్టగా.. ఏపీ అసెంబ్లీ ఆమెదించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ పొంచి ఉన్న తరుణంలో ప్రజల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు.

Tags :

Advertisement