Advertisement

  • తెలంగాణాలో కరెంటు బిల్లుల గందరగోళం ..వందల్లో వచ్చేది లక్షల్లో చూయిస్తున్న వైనం

తెలంగాణాలో కరెంటు బిల్లుల గందరగోళం ..వందల్లో వచ్చేది లక్షల్లో చూయిస్తున్న వైనం

By: Sankar Tue, 07 July 2020 11:25 AM

తెలంగాణాలో కరెంటు బిల్లుల గందరగోళం ..వందల్లో వచ్చేది లక్షల్లో చూయిస్తున్న వైనం



తెలంగాణాలో కరెంటు బిల్లులు గందరగోళానికి గురి చేస్తున్నాయి ..ఇప్పటికే కరెంటు బిల్లులు చాలా ఎక్కువ వస్తున్నాయి అని విమర్శలు వస్తుంటే , ఇప్పుడు మెషిన్లు సరిగా పని చేయక కరెంటు బిల్లులు లక్షల్లో వస్తున్నాయి ..దీనితో ఇంటి యజమానులు గందరగోళానికి గురి అవుతున్నారు ..తాజాగా అలాంటి ఘటనే హైద్రాబాద్లోని లాలాపేట్ లో జరిగింది ..

కృష్ణమూర్తి అనే వ్యక్తి లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే కరెంట్ బిల్లు రీడింగ్ తీయగా.. మార్చి 6 నుంచి జులై 6 తేదీల మధ్య 3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినట్లు నిర్ధారించారు. దీంతో అతడికి రూ.25,22,467 బిల్లు వేశారు.ఆ బిల్లు చూడగానే కృష్ణమూర్తి షాకయ్యాడు. తన ఇల్లు అమ్మినా అంత డబ్బు వచ్చే అవకాశం లేకపోవడంతో... తార్నాకలోని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు మీటర్‌లో లోపం ఉందని గుర్తించారు. అతడి ఇంటికి కొత్త మీటరు బిగించి రూ. 2095 బిల్లు వేశారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు.

జూన్ నెలలో నల్గొండలోని రెండు గదుల రేకుల ఇంటికి కూడా ఇలాగే రూ.19 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. రెండు ట్యూబ్ లైట్లు, ఓ ఫ్యాన్, ఓ టీవీ ఉన్న తమకు అంత బిల్లు రావడంతో అద్దె ఇంట్లో ఉండే మహిళ అవాక్కైంది. ఈ విషయమై అధికారులను నిలదీయగా.. తప్పిదాన్ని సరి చేశారు. రూ.1002 బిల్లు వేశారు

Tags :
|
|

Advertisement