Advertisement

  • ఏకవచనంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరు: మంత్రి తలసాని

ఏకవచనంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరు: మంత్రి తలసాని

By: chandrasekar Sat, 21 Nov 2020 3:15 PM

ఏకవచనంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరు: మంత్రి తలసాని


హైదరాబాద్‌లో అభివృద్ధి చూపించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేం ఓట్లు అడుగుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఏమిచ్చిందని మంత్రి ప్రశ్నించారు. వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, రూ.10వేలు సాయం చేశామన్నారు. ఏకవచనంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరు. మేం అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలం. రూ.10వేలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖ రాసింది. హైదరాబాద్‌లో భారీ వరదలు వస్తే కేంద్ర మంత్రి వచ్చి చూసి వెళ్లాడు తప్ప ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మంత్రి పేర్కొన్నారు.

మేం చేసిన అభివృద్ధే మా కార్పొరేటర్లను గెలిపిస్తుంది. రూ.400 కోట్లు తెచ్చామని చెప్తున్న మీరు లేఖను విడుదల చేయండి. బండి సంజయ్‌, బీజేపీ నేతలు ఉనికి కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. అర్థంలేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు. బీజేపీ మాకు పోటీయే కాదని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement