Advertisement

  • కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు

కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు

By: Dimple Sat, 22 Aug 2020 7:34 PM

కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు

కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దంపతులు చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే ఉన్నారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా పోరాడుతూ ఎస్పీబీ చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

మరో వైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యంకూడా కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లోకి కుటుంబ సభ్యులను ఎవ్వరినీ అనుమతించకుండా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ, కుమారుడు చరణ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఇంటర్నల్‌ మెడిసన్‌, క్రిటికల్‌ కేర్‌, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్‌ డీసీజెస్‌, ఎక్మోకేర్‌లో విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు. వీరంతా అంతర్జాతీయస్థాయి వైద్యులతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారు. యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తీసుకుంటున్న చర్యలపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు.’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Tags :
|

Advertisement