Advertisement

  • మరో ఆరు నెలల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాము...సింగరేణి సీఎండీ

మరో ఆరు నెలల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాము...సింగరేణి సీఎండీ

By: Sankar Wed, 30 Dec 2020 4:06 PM

మరో ఆరు నెలల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాము...సింగరేణి సీఎండీ


సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉన్న ఖాళీలన్నీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు.

చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్‌ స్టాఫ్, సూపర్‌ వైజర్లు, మెడికల్‌ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. సింగరేణి యాజమాన్యం, మైన్స్‌ సేఫ్టీ డీజీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు/అధికారుల సంఘం ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంటర్నల్‌ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.

Tags :
|

Advertisement