Advertisement

  • కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన సింగరేణి యాజమాన్యం ..

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన సింగరేణి యాజమాన్యం ..

By: Sankar Tue, 28 July 2020 7:30 PM

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టిన సింగరేణి యాజమాన్యం ..



సింగరేణి ప్రాంతాల్లో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం పలు చర్యలను చేపట్టింది. ఈ విషయాలను హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ ల తో మంగళవారం నిర్వహించిన వీడియో సమావేశంలో సంస్థ డైరెక్టర్లు వివరించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎం బలరాం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కరోనా వ్యాధి సోకిన వారికి తక్షణం వైద్య సహాయం అందించడానికి సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ ఆదేశాల పై తీసుకున్న చర్యలను ఏరియా జనరల్ మేనేజర్ లకు వివరించారు .అలాగే పలు సూచనలు చేశారు .

సింగరేణి ఏరియాలలో ర్యాపిడ్ టెస్టుల నిర్వహణ కోసం సంస్థ 5,000 కిట్లను కొనుగోలు చేసిందని వివరించారు . వీటిని గురువారం నాటికి ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు .వీటి రాకతో సింగరేణి ప్రాంతంలో వెనువెంటనే కరోనా పరీక్షలు నిర్వహించే వీలు కలగనుందని పేర్కొన్నారు. అలాగే హైదరాబాదులోని మరో మూడు వెంటిలేటర్ సౌకర్యం గల సూపర్ స్పెషాలిటీ దవాఖానలతో అత్యవసర సేవల కోసం ఒప్పందం కుదుర్చుకున్న వివరాలను వెల్లడించారు.

అన్ని ఏరియాల్లో కరోనా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో వైద్య సిబ్బంది వారి సహాయకులకు ఎటువంటి భయం లేకుండా పని చేయటానికి వారిలో స్ఫూర్తి నింపాలని డైరెక్టర్లు కోరారు. కార్యక్రమంలో జీఎం కోఆర్డినేషన్ రవిశంకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాగా సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న స్వచ్చంధ లాక్ డౌన్ విధించాలని కార్మికులు ధర్నా చేసిన విషయం తెలిసిందే ..నిత్యం వేలమంది పని చేసే ఈ గనుల్లో ఒక్కరికి వచ్చిన కూడా అది చాలా మందికి పాకే అవకాశం ఉంది ..దీనితో కార్మికులు తీవ్ర ఆందోళన చెంది విధులను బహిష్కరించారు ..






Tags :
|
|

Advertisement